PMAY స్కీమ్ అవలోకనం

2015 లో భారత ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) అనే పథకాన్ని ప్రారంభించింది.

PMAY పథకం 2022 నాటికి అందరికీ సరసమైన గృహనిర్మాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ICICI హోమ్ ఫైనాన్స్ లో మేము కేంద్ర ప్రభుత్వ 'అందరికీ హౌసింగ్' మిషన్‌తో అనుసంధానం చేసాము మరియు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) లో పేర్కొన్న విధంగా ప్రయోజనాలను అందిస్తున్నాము.

భారతదేశంలో గృహ అవసరాలను తీర్చడానికి EWS / LIG / MIG విభాగాలకు ఇల్లు కొనుగోలు / నిర్మాణం / పొడిగింపు / మెరుగుదల కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) - అందరికీ గృహనిర్మాణం, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS) అనే వడ్డీ రాయితీ పథకాన్ని జూన్ 2015 లో గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ (మోహుపా (MoHUPA)) ప్రవేశపెట్టింది.

మా గృహ రుణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) యొక్క పొడిగింపుగా నిర్మించబడింది, ఇది మీకు ₹ 2.67 లక్షల వరకు సబ్సిడీ ప్రయోజనాన్ని అందిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నుండి తిరిగి చెల్లించే ఎంపికల అర్హత నిబంధనల వరకు, మీ మరియు మీ కుటుంబ సభ్యుల కలలను నిజం చేయడంలో, మీకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము.

మీ డ్రీమ్ హోమ్ మిమ్మల్ని గేటెడ్ కమ్యూనిటీలకు మించి, గ్రామ పంచాయతీలు మరియు రెగ్యులరైజ్డ్ కాలనీలలోకి తీసుకువెళుతుంటే, మేము మీకు మద్దతు ఇస్తాము. మీరు ఆదాయ పన్ను రిటర్న్ వంటి అధికారిక ఆదాయ రుజువులను ఏర్పాటు చేయలేకపోతే, మేము మీకు మద్దతు ఇస్తాము. గతంలో మీరు గృహ రుణం పొందడం కష్టమనిపించినట్లయితే లేదా మీరు అలాంటిదాన్ని పొందగలరని నిజంగా నమ్మకపోతే, మేము మీకు మద్దతు ఇస్తాము! మా 135+ ICICI హెచ్‌ఎఫ్‌సి శాఖలలో, మీరు స్నేహపూర్వక, సహాయక స్థానిక నిపుణులను కనుగొంటారు, వారు ఇంటిని సొంతం చేసుకోవడం గురించి మీకున్న సందేహాలను నివృత్తి చేస్తారు.

PMAY ప్రయోజనాలు

వడ్డీ భాగానికి అందించే సబ్సిడీ గృహ రుణంపై అవుట్ ఫ్లో తగ్గిస్తుండటంతో పిఎమ్ఎవై కింద CLSS గృహ రుణాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ పథకం కింద సబ్సిడీ మొత్తం ఎక్కువగా మీరు చెందిన ఆదాయ వర్గం మరియు ఆస్తి యూనిట్ యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

మీరు పిఎమ్ఎవై కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు చేస్తున్నారు, మొదటి రెండు దశలు ముగిశాయి. ప్రస్తుతం, చివరి దశ నడుస్తోంద; ఇది ఏప్రిల్ 1, 2019 న ప్రారంభమైంది మరియు మార్చి 31, 2022 తో ముగుస్తుంది..

కాబట్టి మీరు పిఎమ్ఎవై ను పొందాలనుకుంటే, ఇదే సరైన సమయం.

ఆదాయ సమూహాలు (పిఎమ్ఎవై ప్రయోజనాల కోసం)
  • EWS / LIG పథకం - ఈ పధకం జూన్ 17, 2015 నుండి అమలులోకి వచ్చింది మరియు మార్చి 31, 2022 వరకు చెల్లుతుంది.
  • MIG-1 మరియు MIG-II పథకం - ఈ పధకం మార్చి 31, 2020 నుండి అమలులోకి వచ్చింది మరియు 2021 మార్చి 31 వరకు చెల్లుతుంది.

లబ్ధిదారుడి కుటుంబం యొక్క నిర్వచనం: భర్త, భార్య, పెళ్లికాని కుమారులు మరియు / లేదా పెళ్లికాని కుమార్తెలు. (వైవాహిక స్థితితో సంబంధం లేకుండా వయోజన సంపాదన సభ్యుడిని MIG కేటగిరీలో ప్రత్యేక కుటుంబంగా పరిగణించవచ్చు)

ఇతర షరతులు
  • ఆదాయం కాకుండా, మరొక ముఖ్యమైన షరతు ఉంది: లబ్ధిదారుడి కుటుంబం అతని / ఆమె పేరు మీద లేదా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా అతని / ఆమె కుటుంబంలోని ఏ సభ్యుడి పేరిట అయినా ఒక పక్కా ఇంటిని కలిగి ఉండకూడదు;
  • మహిళల యాజమాన్యం / సహ-యాజమాన్యం- EWS / LIG కోసం: మహిళల యాజమాన్యం కొత్త వాటి కొనుగోలుకు మాత్రమే తప్పనిసరి మరియు ఇప్పటికే ఉన్న భూమిలో కొత్త నిర్మాణం కోసం లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగుపరచడం / మరమ్మతులు చేయడం కోసం కాదు. MIG-I మరియు MIG-II కోసం: తప్పనిసరి కాదు
  • మీరు వివాహం చేసుకుని, పిమ్ఎవై ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు లేదా మీ జీవిత భాగస్వామి సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా చేయవచ్చు
  • జంటగా మీ ఆదాయం యూనిట్‌గా పరిగణించబడుతుంది; ఏదేమైనా, కుటుంబంలో మరొక వయోజన సంపాదన సభ్యుడు ఉంటే, అతని / ఆమె వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ప్రత్యేక కుటుంబంగా పరిగణించబడుతుంది
  • గృహ కొనుగోలు / నిర్మాణంపై మీకు ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ సహాయం ఉండకూడదు
  • మీరు మీ కుటుంబ మొత్తం ఆదాయం మరియు కావలసిన ఆస్తి యొక్క శీర్షిక గురించి స్వీయ ప్రకటనను మీ రుణదాతకు సమర్పించాలి
  • పిఎమ్ఎవై కింద ఉన్న అన్ని రుణ ఖాతాలను మీ ఆధార్ కార్డుతో అనుసంధానించాలి.

PMAY పథకం అర్హత

మొదట, ఆస్తి కూడా:

  • రాయితీని పొందడానికి, మీరు ఎంచుకున్న నివాస ఆస్తి ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో ఒక వాటా లేదా భవనం మొత్తం ఒక వాటా అయి ఉండాలి.
  • అర్హత కలిగిన ఒక వాటా లో ప్రాథమిక సౌకర్యాలు మరియు మరుగుదొడ్డి, నీరు, మురుగునీటి, రహదారి, విద్యుత్ మొదలైన మౌలిక సదుపాయాలు ఉండాలి;

రెండవది, కార్పెట్ ప్రాంతం (గోడలు చేర్చబడలేదు) మించకూడదు:

  • EWS - 30 చదరపు మీటర్లు (323 చదరపు అడుగులు)
  • LIG - 60 చదరపు మీటర్లు (646 చదరపు అడుగులు)
  • MIG-I - 160 చదరపు మీటర్లు (1722 చదరపు అడుగులు)
  • MIG-II - 200 చదరపు మీటర్లు (2153 చదరపు అడుగులు)

చివరగా, ప్రదేశం:

  • 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని చట్టబద్ధమైన పట్టణాలు మరియు తరువాత తెలియజేయబడిన పట్టణాలు, చట్టబద్ధమైన పట్టణానికి సంబంధించి నోటిఫై చేయబడిన ప్రణాళిక ప్రాంతంతో సహా.
  • మీ పట్టణం అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే, క్రింద ఉన్న నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) లింక్‌పై క్లిక్ చేసి, “స్టాట్యూటరీ టౌన్ అండ్ ప్లానింగ్ ఏరియా కోడ్స్” అని గుర్తు పెట్టబడిన విభాగాన్ని చూడండి. https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/

PMAY పథకం రుణ పరిమితులు

  • EWS: రూ .6 లక్షలు;
  • LIG (ఎల్‌ఐజి): రూ .6 లక్షలు;
  • MIG (I): రూ .9 లక్షలు;
  • MIG (II): రూ .12 లక్షలు

 

గమనిక:
పేర్కొన్న పరిమితులకు మించిన అన్ని అదనపు రుణాలు ఏదైనా ఉంటే, సబ్సిడీ లేని రేటుకు అందించబడతాయి.
వడ్డీ రాయితీ యొక్క నికర ప్రస్తుత విలువ (NPV) 9% తగ్గింపు రేటుతో లెక్కించబడుతుంది

 

PMAY స్కీమ్ లోన్ గడువు కాలం

నాలుగు వర్గాల కింద ఉన్న రుణ చెల్లింపుకు గడువు సమయం 20 సంవత్సరాలు

PMAY పథకం వడ్డీ రేట్లు

  • EWS: 6.5%; రూ .2.67 లక్షల వరకు
  • LIG: 6.5%; రూ .2.67 లక్షల వరకు
  • MIG (I): 4%; రూ .2.35 లక్షల వరకు
  • MIG (II): 3%; రూ .2.30 లక్షల వరకు

 

PMAY పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి

18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఏ కుటుంబం అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు PMAY సబ్సిడీ ప్రయోజనం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు మీ దరఖాస్తును 135+ ICICI HFC బ్రాంచ్‌లలో దేనిలోనైనా సమర్పించవచ్చు. మా స్థానిక శాఖ నిపుణులు మీ అభ్యర్థనను అక్కడికక్కడే సమీక్షిస్తారు మరియు క్లెయిమ్ ను నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు పంపుతారు. మీ కోసం ప్రక్రియను శీఘ్రంగా మరియు సరళంగా చేయడమే మా లక్ష్యం.

  1. స్వీయ ఖరారు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి నింపండి.
  2. మీ సమీప ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి బ్రాంచ్‌లో సమర్పించండి.
  3. మీ అసలు ఐడి ప్రూఫ్‌తో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను తీసుకెళ్లండి.

*సబ్సిడీ కోసం మీ అభ్యర్థన ఆమోదానికి లోబడి ఉంటుంది మరియు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుండి క్లియరెన్స్ ఇవ్వబడుతుంది- CLSS యొక్క ప్రయోజనాలను పొందటానికి మీ అర్హతను అంచనా వేయడం భారత ప్రభుత్వ స్వంత అభీష్టానుసారం. ఇక్కడ ఉన్న విషయం అర్హతను అంచనా వేయడానికి పథకం క్రింద వివరించిన పరిమితులు.

PMAY సబ్సిడీ కాలిక్యులేటర్

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కి అర్హులేనా మరియు మా పిఎంఎవై సబ్సిడీ కాలిక్యులేటర్‌తో మీరు ఎంత రాయితీని పొందవచ్చో తెలుసుకోండి.

ప్రభుత్వం నుండి ఏదైనా గృహనిర్మాణ పథకం కింద మీరు కేంద్ర సహాయం పొందారా? లేదా PMAY కింద ఏదైనా ప్రయోజనం ఉందా?
ఇది మీ మొదటి పక్కా ఇల్లా?
మొత్తం వార్షిక కుటుంబ ఆదాయాన్ని నమోదు చేయండి
Thirty Thousand
అప్పు మొత్తం
Ten Lakhs
రుణ గడువు కాలం (నెలలు) నమోదు చేయండి
8 year's and 1 month
నెలలు

PMAY Subsidy Amount

0


సబ్సిడీ వర్గం

EWS/LIG

EMI లో నికర తగ్గింపు

నికర తగ్గింపు విలువ

వివరాలను క్రింద పూరించండి

దయచేసి మీ పూర్తి పేరు నమోదు చేయండి
దయచేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి రుణ మొత్తాన్ని నమోదు చేయండి
దయచేసి ఇమెయిల్ ఐడిని నమోదు చేయండి
మీ నగరాన్ని ఎంచుకోండి
దయచేసి నిబంధనలు & షరతులను అంగీకరించండి

PMAY గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

తాజా PMAY జాబితాలో (2021-22) మీ పేరు చెక్‌ చేసుకునేందుకు, మీరు అర్బన్‌ విభాగం లేదా గ్రామీణ విభాగం కింద దరఖాస్తు చేశారో చెక్‌ చేసుకోవడం ద్వారా ప్రారంభించండి.

మీరు PMAY అర్బన్‌ విభాగం కింద అప్లై చేస్తే, ఈ కింది స్టెప్స్‌ అనుసరించండి:

  • సందర్శించండి pmaymis.gov.in
  • ‘లబ్ధిదారును ఎంచుకోండి’పై క్లిక్‌ చేయండి
  • డ్రాప్‌-డౌన్‌ మేనూ నుంచి ‘పేరుతో సెర్చ్‌ చేయండి’పై క్లిక్‌ చేయండి.
  • మీ ఆధార్‌ నంబరు నమోదు చేయండి
  • మీ ఆధార్‌ నంబరు డేటా బేస్‌లో లభిస్తే, మీ పేరు జాబితాలో ఉంటుంది.

మీరు PMAY రూరల్‌ విభాగం కింద అప్లై చేస్తే, ఈ కింది స్టెప్స్‌ అనుసరించండి:

  • సందర్శించండి rhreporting.nic.in/netiay/Benificiary.aspx
  • మీ రిజిస్ట్రేషన్‌ నంబరు నమోదు చేయండి మరియు ‘సబ్మిట్‌’పై క్లిక్‌ చేయండి.
  • నమోదు చేసిన రిజిస్ట్రేషన్‌ నంబరు లబ్ధిదారుని డేటాబేస్‌లో లభిస్తే, మీ వివరాలు ప్రతిబింబిస్తాయి.
  • రిజిస్ట్రేషన్‌ నంబరు లేకుండా సెర్చ్‌ చేసేందుకు, ‘అధునాతన సెర్చ్‌’పై క్లిక్‌ చేయండి.
  • మిమ్మల్ని ఒక పేజీకి పంపడం జరుగుతుంది, దీనిలో మీరు మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌, పంచాయత్‌, పేరు, బిపిఎల్‌ నంబరు మరియు మంజూరు ఆర్డరు లాంటి వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది.
  • ఫలితాన్ని చెక్‌ చేసేందుకు సెర్చ్‌పై క్లిక్‌ చేయండి

 

PMAY ఆఫ్‌లైన్‌కి అప్లై చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేట్‌ చేసే కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ని (సిఎస్‌సి) సందర్శించండి. ఆఫ్‌లైన్‌ అప్లికేషన్‌లకు, 25 (ప్లస్‌ జిఎస్‌టి) రిజిస్ట్రేషన్‌ ఫీజు వర్తిస్తుంది. మీ అప్లికేషన్‌కి సపోర్టు చేసేందుకు దయచేసి ఈ కింది డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్ళండి:

  • గుర్తింపు ధృవీకరణ (ఆధార్‌ కార్డు/పాన్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఓటర్‌ ఐడి కార్డు)
  • చిరునామా ధృవీకరణ
  • ఆదాయ ధృవీకరణ (ఫారం 16/తాజా ఐటి రిటర్న్‌ లేదా గత ఆరు నెలల బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌)
  • మీకు లేదా మీ సమీప కుటుంబ సభ్యునికి భారతదేశంలో సొంత ఇల్లు ఏదీ లేదని తెలియజేసే అఫిడవిట్‌
  • కొనబోయే ఆస్తి యొక్క వాల్యుయేషన్‌ సర్టిఫికెట్‌
  • డెవలపర్‌ లేదా బిల్డర్‌తో నిర్మాణ ఒప్పందం
  • నిర్మాణం యొక్క ఆమోదించిన ప్లాన్‌
  • సర్టిఫికెట్‌ ద్వారా నిర్మాణం/మరమ్మతుల వ్యయాన్ని ఆర్కిటెక్ట్‌ లేదా ఇంజినీర్‌ ధృవీకరించాలి
  • ఇంటి ఫిట్‌నెస్‌ గురించిన సర్టిఫికెట్‌
  • కాంపిటెంట్‌ అథారిటి లేదా సంబంధిత హౌసింగ్‌ సొసైటీ నుంచి ఎన్‌ఒసి
  • కొనుగోలు చేసిన అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదు (వర్తిస్తే)
  • ఆస్తి/ఒప్పందం కేటాయింపు లేఖ లేదా ఇతర సంబంధిత ఆస్తి డాక్యుమెంట్లు

లేదు. ప్రస్తుత హోమ్‌ లోన్‌కి PMAY సబ్సిడీ ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఈ స్కీమ్‌ యొక్క అర్హత ప్రామాణికత ప్రకారం లబ్ధిదారునికి అతని/ఆమె పేరుతో లేదా అతని/ఆమె కుటుంబంలోని ఎవరైనా వ్యక్తి పేరుతో భారతదేశంలోని ఏ ప్రాంతంలో కూడా పక్కా ఇల్లు ఉండకూడదు. కాబట్టి, మొట్టమొదటిసారి ఇంటిని కొనేందుకు చూస్తున్న వారికి మాత్రమే పిఎంఎవై స్కీమ్‌ వర్తిస్తుంది.

మీరు ఇప్పటికే హోమ్‌ లోన్‌ కస్టమర్‌ అయితే, మీ పేరుతో మీకు అప్పటికే సొంత ఇల్లు ఉందని, కాబట్టి PMAY కింద వడ్డీ సబ్సిడీ పొందడానికి మీ దరఖాస్తు తిరస్కరించబడుతుందని అర్థం.

 

మీరు PMAY CLSS సబ్సిడీకి దరఖాస్తు చేస్తే, సబ్సిడీ సొమ్ము పొందడానికి 3-4 నెలల సమయం పడుతుంది.

సబ్సిడీ పొందడానికి మీరు PMAY కింద రుణం కోసం మీరు దరఖాస్తు చేస్తే, రుణం మరియు సబ్సిడీ సొమ్ము పొందడానికి మీకు గల అర్హతను రుణదాత పరీక్షిస్తారు. రుణదాత అప్పుడు రుణం మంజూరు చేస్తారు మరియు సెంట్రల్‌ నోడల్‌ ఏజెన్సీల (సిఎన్‌ఎలు) నుంచి క్లెయిమ్‌ చేస్తారు. ప్రస్తుతం మూడు సిఎన్‌ఎలు ఉన్నాయి- హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో), నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (NHB) మరియు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. సిఎన్‌ఎలు దరఖాస్తును క్రాస్‌ చెక్‌ చేస్తారు మరియు ఫండ్స్‌ని విడుదల చేస్తారు, ఇవి వీటిని ప్రభుత్వం నుంచి పొందుతారు.

PMAY హోమ్‌ లోన్‌ కోసం బ్యాంకులో లేదా ఏదైనా ఇతర లెండింగ్‌ సంస్థలో దరఖాస్తు చేసిన తరువాత, మీరు అప్లికేషన్‌ ఐడి పొందుతారు. అప్లికేషన్‌ని సమర్పించిన తేదీ నుంచి సబ్సిడీని విడుదల చేసిన తేదీ వరకు స్టేటస్‌ని తెలుసుకరునేందుకు ఈ అప్లికేషన్‌ ఐడిని ఉపయోగించవచ్చు. SMS ద్వారా కూడా మీరు అప్లికేషన్‌ అప్‌డేట్‌లు పొందుతారు.

PMAY స్కీమ్‌ కింద ప్రయోజనాలు పొందడానికి ప్రతి ఒక్క వ్యక్తి అర్హులవ్వరు. PMAY సబ్సిడీ స్కీమ్‌కి దరఖాస్తు చేయడానికి ముందు, స్కీమ్‌కి మీరు అర్హులా అనే విషయం మీరు తప్పనిసరిగా చెక్‌ చేయాలి. PMAY సబ్సిడీకి దరఖాస్తు చేయడానికి అర్హులు కానివారు ఈ కింది జాబితాను స్పష్టంగా తెలియజేస్తోంది:

  • దేశంలో ఏ ప్రాంతంలోనైనా అప్పటికే పక్కా ఇల్లు గల వ్యక్తులు
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న హౌసింగ్‌ స్కీమ్‌ నుంచి గతంలో ప్రయోజనం పొందిన వ్యక్తులు
  • ₹ 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం గల వ్యక్తులు
  • స్కీమ్‌కి (ఎప్పటికప్పుడు ప్రబుత్వం ఈ జాబితాను అప్‌డేట్‌ చేస్తుంది) ప్రభుత్వం పేర్కొన్న విధంగా నగరాలు మరియు పట్టణాల జాబితా బయట ఇంటిని కొంటున్న వ్యక్తులు.

ఈ కింది వాళ్ళున్న కుటుంబాలకు PMAY సబ్సిడీ స్కీమ్‌ అందించబడుతుంది:

  • భర్త
  • భార్య
  • అవివాహిత పిల్లలు

సంపాదిస్తున్న పెద్దవాళ్ళు తమ వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా, ఎంఐజి కేటగిరిలో వేరే కుటుంబంగా పరిగణించబడవచ్చు.

లబ్ధిదారుని పేరుతో లేదా లబ్ధిదారుని కుటుంబం యొక్క సభ్యుడు ఎవ్వరి పేరుతోనూ భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా సొంత పక్కా ఇల్లు ఉండకూడదని దయచేసి గమనించండి.

PMAY సబ్సిడీ స్కీమ్‌కి మీ అర్హతను నిర్ణయించేందుకు మీ కుటుంబ వార్షిక ఆదాయం కీలకమైన అంశం. పెట్టుబడులు, ఉద్యోగాలు మరియు ఇతర వాటితో సహా వివిధ మూలాల నుంచి కుటుంబంలోని సభ్యులందరి యొక్క ఆదాయం కుటుంబ ఆదాయంలోకి పరిగణనలోకి తీసుకోబడుతుందని దయచేసి గమనించండి.

వివిధ PMAY కుటుంబ కేటగిరిల యొక్క ఆదాయ నిబంధనలను అర్థంచేసుకునేందుకు ఈ కింది పట్టికను చదవండి.

 కుటుంబ కేటగిరి

 కుటుంబ వార్షిక ఆదాయం

 ఇడబ్ల్యుఎస్‌

 ₹ 3 లక్షలు

 ఎల్‌ఐజి

 ₹ 6 lakh

PMAY కింద వడ్డీ సబ్సిడీ ప్రయోజనం పొందాలంటే, మీ అప్లికేషన్‌పై ఈ కింది చర్యలు తీసుకోవడం జరుగుతుంది:

  • ఒకసారి మీకు హోమ్‌ లోన్‌ పంపిణీ చేయబడితే, మీ రుణదాత మీ దరఖాస్తు వివరాలను వ్యాలిడేషన్‌ కోసం సెంట్రల్‌ నోడల్‌ ఏజెన్సీకి (సిఎన్‌ఎ) పంపుతారు.
  • శ్రద్ధగా పరిశీలించినతరువాత, మీరు అర్హులైతే సబ్సిడీని సిఎన్‌ఎ ఆమోదిస్తారు.
  • సబ్సిడీ మీ రుణదాతకు విడుదల చేయబడుతుంది
  • మీ రుణదాత ఇప్పుడు దీనిని మీ హోమ్‌ లోన్‌ అకౌంట్‌కి క్రెడిట్‌ చేస్తారు
  • ఆ ప్రకారంగా సబ్సిడీని రుణంలో అడ్జస్ట్‌ చేయడం జరుగుతుంది.

మీ ఇంటి లోన్‌ అకౌంట్‌లో సబ్సిడీని పొందిన మీదట, మీరు దీనిని మీ లోన్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లో మీరు దీనిని చెక్‌ చేయవచ్చు. ఇంకా, సబ్సిడీని పొందిన తరువాత, మీ ఇఎంఐ సొమ్ము కూడా అంతకంటే ముందుగా తగ్గించబడుతుంది.