అవలోకనం- గోల్డ్‌ లోన్‌

మీరు ఎంతగా ప్రణాళిక చేసుకున్నప్పటికీ, జీవితంలో అనుకోని ఖర్చులు వస్తుంటాయి. ఇది వైద్య అత్యవసరం కావచ్చు లేదా మీ వ్యాపారానికి అత్యవసరంగా నగదు అవసరం కావచ్చు. మా గోల్డ్‌ లోన్‌ స్వల్ప కాలిక నగదు అవసరాలను తీర్చుకునేందుకు సౌలభ్యమైన మార్గం, ఎందుకంటే  మీ లోన్‌ వ్యవధి అంతటా ఒకేలా ఉండే ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లతో ఇది వస్తోంది.

ఇది సరళమైనది, వేగవంతమైనది మరియు భద్రమైనది. మీకు సమీపంలో ఉన్న ICICI HFC బ్రాంచికి విచ్చేయండి మరియు మీకు అవసరమైన డబ్బు వెంటనే పొందండి.

ముఖ్య విశిష్టతలు మరియు ప్రయోజనాలు- గోల్డ్‌ లోన్‌

సత్వరం రుణ వితరణ

మీరు చేయవలసిందల్లా మీ సమీపంలోని ICICI HFC బ్రాంచిని మీరు ఒకసారి సందర్శించడమే. మీరు కేవలం 30 నిమిషాల్లో గోల్డ్‌ లోన్‌ పొందవచ్చు, ఎందుకంటే మా ICICI HFC బ్రాంచిల్లో బంగారం విలువను లెక్కకట్టేవారు ఉన్నారు. వీళ్ళు మీ సమక్షంలో బంగారం విలువను లెక్కకడతారు. ఈ బ్రాంచిలోని మా వ్యాపార టీమ్‌ మీ దరఖాస్తు అప్పటికప్పుడు సమీక్షిస్తుంది మరియు రుణ వితరణ చేస్తుంది.

వడ్డీ రేట్లలో పెరుగుదల ఉండదు

ICICI HFC గోల్డ్‌ లోన్‌తో, మీ రుణ వ్యవధిలో ఏ సమయంలోనూ మీ వడ్డి రేటు మారదు. వడ్డీ రేటు సంవత్సరానికి 13% నుంచి 17% వరకు ఉంటుంది.

సౌలభ్యమైన పునర్‌చెల్లింపు ఎంపికలు

 • రుణ వ్యవధిలో ఏ సమయంలోనైనా ముందుగా చెల్లించండి
 • వడ్డీతో సహా సంపూర్ణ మొత్తాన్ని, వ్యవధి ముగింపులో చెల్లించండి (బుల్లెట్‌ రీపేమెంట్‌)

సౌకర్యవంతమైన రుణం సొమ్ము

మా గోల్డ్‌ లోన్స్‌ ₹ 10,000 నుంచి ప్రారంభమై ₹ 10 లక్షల వరకు ఉంటాయి. మీరు అప్పటికే సంపాదించిన ఆస్తిపై మీ అత్యవసర అవసరాలను తీర్చుకోవచ్చు.

మీ బంగారానికి భద్రత

మీ సమీపంలోని ICICI HFC బ్రాంచిలో మీరు డిపాజిట్‌ చేసిన బంగారం మీ సమక్షంలో సీలు చేస్తారు. మీ బంగారం నిఘా కింద ఉండేందుకు మరియు ఎల్లవేళలా రక్షించబడేలా చూసేందుకు హై గ్రేడ్‌ వాల్ట్‌కి ఇది జాగ్రత్తగా తరలించబడుతుంది.

ICICI HFC నుంచి లోన్‌ ఎందుకు తీసుకోవాలి?

మా బ్రాంచిల్లో అత్యదిక వాటిల్లో బంగారం విలువ మదింపు నిపుణులు ఉండటం వల్ల, మీరు కేవలం 30 నిమిషాల్లో రుణం పొందేలా చూస్తాము.

మీరు ICICI HFC లోన్‌ ప్రోడక్ట్‌ని ఎంచుకున్నప్పుడు, మీరు ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి కుటుంబంలో భాగమవుతారు. ICICI HFC యొక్క ప్రస్తుత కస్టమర్‌గా, మీ దరఖాస్తు వేగంగా సమీక్షించబడుతుంది, ఎందుకంటే అప్పటికే అనేక చెకింగ్‌లు చేయబడివుంటాయి. మీకు అప్పటికప్పుడు గోల్డ్‌ లోన్‌ అవసరం కావచ్చు, కానీ భవిష్యత్తులో, మీ సొంత ఇంట్లో, లేదా మీ వ్యాపార విస్తరణకు, లేదా మీ పొదుపులు పెంచుకోవడానికి పెట్టుబడిపెట్టేందుకు కూడా మీరు లోన్‌ పొందవచ్చు.

మీకు సమీపంలో ఉన్న ICICI HFC బ్రాంచిని సందర్శించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ప్రత్యేక ఆఫర్‌లు. మీరు డిస్కౌంట్‌ రేట్లు పొందవచ్చు మరియు మా బ్రాంచిల్లో అనేక ఆఫర్‌లు ఆనందించవచ్చు. మా అంతర్గత నిపుణులు ప్రతి ఆఫర్‌ యొక్క ప్రయోజనాలపై మీకు మార్గదర్శనం చేస్తారు, దీనివల్ల మీకు నిజంగా సహాయపడే దానిని మీరు తెలుసుకోవచ్చు.

అర్హత-గోల్డ్‌ లోన్‌

ICICI HFC నుంచి గోల్డ్‌ లోన్‌ పొందడానికి అర్హులయ్యేందుకు మీరు తప్పకుండా నెరవేర్చవలసిన ప్రాథమిక ప్రామాణికత ఉంది.

 • మీరు తప్పకుండా భారతీయ పౌరులు అయివుండాలి
 • మీరు తప్పకుండా కనీసం 25 సంవత్సరాల వయస్సు వారై ఉండాలి
 • లోన్‌ మెచ్యూరిటి సమయంలో మీ వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు, దీనివల్ల ఇఎంఐలు చెల్లించకుండానే మీ బంగారు సంవత్సరాలను మీరు ఆనందించగలుగుతారు.
 • మీరు డిపాజిట్‌ చేస్తున్న బంగారు ఆభరణాలకు మీరు తప్పకుండా యజమాని అయివుండాలి
 • మీరు తప్పకుండా వ్యక్తి అయివుండాలి (వ్యక్తులు కానివారికి మేము గోల్డ్‌ లోన్‌ ఇవ్వము)

ఎలా దరఖాస్తు చేయాలి

గోల్డ్‌ లోన్‌కి దరఖాస్తు చేసి ఆమోదం పొందడానికి కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మీరు ఏం చేయాలో ఇక్కడ ఇస్తున్నాము.

మీకు సమీపంలో ఉన్న ICICI HFC బ్రాంచికి విచ్చేయండి మరియు మీ బంగారాన్ని డిపాజిట్‌ చేయండి

ప్రతి బ్రాంచిలో ప్రొఫెషనల్‌ వ్యాల్యూయర్‌ ఉంటారు, వీళ్ళు మీ బంగారానికి విలువ కడతారు మరియు బంగారం ధర ఆధారంగా, మీ బంగారం విలువ ఎంతో మీకు చెబుతారు.

 

గోల్డ్‌ లోన్‌కి కావలసిన పత్రాలు

ICICI HFCలో గోల్డ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు తప్పకుండా ఈ డాక్యుమెంట్లను మీకు సమీపంలో ఉన్న బ్రాంచికి తీసుకెళ్ళండి.

 • కెవైసి డాక్యుమెంట్లు (గుర్తింపు ధృవీకరణ మరియు చిరునామా ధృవీకరణ)
 • పాన్‌/ఫారం 60
 • ఫోటోగ్రాఫ్‌
 • బ్యాంక్‌ క్యాన్సిల్‌డ్‌ చెక్కు

డిస్‌క్లెయిమర్‌:

 • ఇక్కడ పైన తెలియజేసిన విధంగా రేట్లు, ఫీజు ICICI హోమ్‌ ఫైనాన్స్‌ యొక్క స్వీయ విఛక్షణ మేరకు ఎప్పటికప్పుడు మార్పులు/సవరణకు లోబడి ఉంటాయి.

Benefits of ICICI HFC Gold Loan

 

గోల్డ్‌ లోన్‌ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

ICICI HFC గోల్డ్‌ లోన్‌ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే ఇది మీకు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు అందిస్తుంది. మీ రుణ వ్యవధి సమయంలో ఇది స్థిరంగా ఉంటుంది.

మీ వ్యవధి ముగిసే ముందు మీరు మీ లోన్‌ని తిరిగిచెల్లిస్తే, మీ బంగారం వెంటనే మీకు తిరిగివ్వబడుతుంది మరియు మీరు మరిన్ని వడ్డీ చెల్లింపులపై ఆదా చేయవచ్చు.

మీ బంగారం నిఘాలో ఉండేలా మరియు ఎల్లవేళలా రక్షించబడేలా చూసేందుకు హైగ్రేడ్‌ విశిష్టతలు గల వాల్ట్‌.

 • కనీస వడ్డీ 13%
 • గరిష్ట వడ్డీ 17%
 • రుణ సొమ్ము ప్రకారం 0.25% నుంచి 1% ప్రాసెసింగ్‌ ఫీజు

ICICI హోమ్‌ ఫైనాన్స్‌లోని ప్రతి బ్రాంచిలో, ప్రొఫెషనల్‌ వ్యాల్యూయర్‌ ఉంటారు, వీళ్ళు మీ బంగారం స్వచ్ఛతను కొలుస్తారు. ఆ రోజున ప్రతి గ్రాము బంగారం ధరతో పాటు ఈ విలువ పరిగణనలోకి తీసుకోబడుతుంది మరియు మీ గోల్డ్‌ లోన్‌ విలువ లెక్కకట్టబడుతుంది.

ఆన్‌లైన్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా మీరు గోల్డ్‌ లోన్‌ తిరిగిచెల్లించవచ్చు. మీరు లోన్‌ సొమ్ము చెల్లించిన వెంటనే బంగారం విడుదల చేయబడుతుంది, కాబట్టి మీ లోన్‌ వ్యవధి  ముగిసే లోపు మీరు ఈ మొత్తాన్ని తిరిగిచెల్లించగలిగితే మీరు వడ్డీ చెల్లింపులపై ఆదా చేయవచ్చు. 

సంవత్సరానికి 6% అపరాధ వడ్డీ ఉంటుంది. ఒకవేళ మీ లోన్‌ని తిరిగిచెల్లించడంలో జాప్యం జరిగితే దీనిని చెల్లించాలి.

అవును అయితే, మీరు ముందస్తు చెల్లింపు చార్జీలు లేకుండానే, మీరు మీ లోన్‌ని తిరిగిచెల్లించవచ్చు.

లేదు

మేము మీ బంగారాన్ని స్టోర్‌ చేసే వాల్ట్‌కి అనేక అత్యున్నత స్థాయి విశిష్టతలు ఉన్నాయి. ఇవి మీ బంగారాన్ని నిఘాలో ఉంచుతాయి మరియు ఎల్లవేళలా రక్షిస్తాయి.

లేదు

మీరు అతితక్కువగా ₹ 10,000 గోల్డ్‌ లోన్‌ పొందవచ్చు. ఆర్థిక అత్యవసరాలకు సంబంధించిన ఒత్తిడి దేనినైనా పరిష్కరించేందుకు గోల్డ్‌ లోన్‌ త్వరిత మరియు సులభ మార్గం. అది వ్యక్తిగతమైనది లేదా వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. కేవలం కొద్ది గంటల్లో, మీకు అవసరమైన డబ్బు మీరు ఏర్పాటుచేసుకోవచ్చు.